ఉపాధి హామీ కూలీల కష్టాలు పవన్ కల్యాణ్‌కు తెలుసా?

by Gantepaka Srikanth |

ఉపాధి హామీ కూలీల కష్టాలు పవన్ కల్యాణ్‌కు తెలుసా?

ఉపాధి హామీ కూలీల కష్టాలు పవన్ కల్యాణ్‌కు తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్(Margani Bharat) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్(Nara Lokesh) షాడో సీఎంలాగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై లోకేష్‌కు ఏమాత్రం నమ్మకం లేదని విమర్శించారు. మంత్రిగా ఉండి.. రాజ్యాంగాన్ని కాకుండా.. రెడ్‌బుక్‌ను నమ్ముతా అనడం ఏంటని ప్రశ్నించారు. మద్యం సిండికేట్లు నడుపుతున్న ఎమ్మెల్యేకు లోకేష్ వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 9 హార్బర్స్‌కు శ్రీకారం చుట్టారని.. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో చేశామని.. అయితే ప్రచారం చేసుకోవడంలో విఫలం అయినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు కూడా పూర్తి స్థాయిలో పరిపాలనపై పట్టు వచ్చినట్లు కనిపించడం లేదని అన్నారు. అసలు ఉపాధి హామీ కూలీల సమస్యలు, కష్టాలు పవన్ కల్యాణ్‌కు తెలుసా? అని అడిగారు. మరో 15 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై పవన్ కల్యాణ్ ఆలోచిస్తానని అంటున్నారు.. అప్పటివరకు జనసేన నేతలు టీడీపీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉండాలని పరోక్షంగా సూచిస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

Next Story