- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మాజీ ఎంపీ భరత్ ఫైర్.. స్ట్రాంగ్ వార్నింగ్
తిరుపతి లడ్డూ విషయంలో తీర్పు అనుకూలంగా రాకపోయేసరికి అకృత్యకార్యాలకు తెరలేపిన కూటమి ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైసీపీ మాజీ ఎంపీ భరత్ హెచ్చరించారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లడ్డూ విషయం(Tirupati Laddu issue)లో తీర్పు అనుకూలంగా రాకపోయేసరికి అకృత్యకార్యాలకు తెరలేపిన కూటమి ప్రభుత్వం కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైసీపీ మాజీ ఎంపీ భరత్(Former YSRCP MP Bharat) హెచ్చరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ములాఖాత్‌లోమాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జి జడ శ్రవణ్‌తో పాటు ఆయన కలిశారు. ఈ సందర్బంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. దారుణంగా, అనైతికంగా మాట్లాడిన వాళ్ళపై ఇప్పటి వరకూ చర్యలు లేవన్నారు. ఇళ్లపై రౌడీ మూకలతో దాడి చేసిన వాళ్లపై కేసులు కట్టలేద్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై రాక్షసంగా దాడి చేశారని మండిపడ్డారు. మాట జారినందుకు క్షమాపణ చెప్పినా కూడా కాపు సింహం అంబటి రాంబాబుపై లేని కేసులు అంటగట్టి సెంట్రల్ జైల్లో పెట్టడం అన్నది అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సుమారు 47 కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని భరత్ పేర్కొన్నారు.
రేపు అన్న రోజున పారిపోతారు..
‘‘అధికారం ఉంది కనుక మీరు ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తున్నారు. రేపు అన్న రోజున మీరు ముగ్గురు మూడు విమానాలు పట్టుకుని పారిపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి లడ్డు విషయంలో తీర్పు మీకు అనుకూలంగా రాకపోయేసరికి మీరు అకృత్య కార్యాలకు తెరలేపారు. కూటమి నేతలు చేస్తున్న ప్రజాస్వామిక కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.’’ అని భరత్ హెచ్చరించారు.






