RRRకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-25 08:38:37  IST  )

మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు భారీ ఊరట లభించింది..

RRRకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju)కు భారీ ఊరట లభించింది. కానిస్టేబుల్‌ ఫరూక్ బాషా(Constable Farooq Basha)పై దాడి కేసుకు సంబంధించి రఘురామతో పాటు అతని సిబ్బందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొనసాగించదలుచుకోలేదని ఢిల్లీ(Delhi)సుప్రీంకోర్టు(Supremecourt)లో ఫరూక్ బాషా అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు ఎఫ్ఐఆర్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

కాగా 2022లో హైదరాబాద్‌లోని రఘురామరాజు ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగడాన్ని గమనించారు. వెంటనే అతన్ని అక్కడ ఉన్న సిబ్బంది పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తి కానిస్టేబుల్ ఫరూక్ బాషా కావడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం తరపున నిఘా ఉంచారనే ఉద్దేశంతో రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్ హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. కానీ కానిస్టేబుల్ బాషా చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దీంతో రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో కానిస్టేబుల్ బాషా తరపున లాయర్ వాదనలు వినిపించారు. బాషా పని చేస్తున్న ప్రాంతానికి హైదరాబాద్ 400 కిలో మీటర్లు ఉండటంతో కేసు కొనసాగించడం ఇష్టంలేదని తెలిపారు. ఈ మేరకు బాషాను అఫిడవిట్ దాఖలు చేయాలని గత విచారణలో ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కానిస్టేబుల్ ఫారూఖ్ బాషా అవిడవిట్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఆర్ఆర్ఆర్‌పై నమోదు అయిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

Next Story