- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యాయత్నానికి గురైన పూజారికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
ఆలయ పూజారిపై దాడి చేసేంత ద్వేషం ఎందుకు?

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా (Kakinada) పరిధిలోని తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుందర సీతారామయ్య శర్మ (50) పూజారిగా (Priest Sundara Seetharamaiah Sharma) విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనపై స్థానికంగా ఉంటే కొండమూరి శివయ్య అనే వ్యక్తి పదునైన వస్తువుతో దాడి చేశాడు. ఈ దాడిలో పూజారి తీవ్రంగా గాయపడగా భక్తులు ఆయన్ను యానాం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దాడి చేసిన వ్యక్తి కోరంగి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సీతారామయ్య శర్మ చికిత్సను పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ స్పందించారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లి పూజారి సుందర సీతారామయ్య శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్య స్థితి గతుల గురించి వాకాబు చేశారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆలయాలు, పూజారులపై జరుగుతున్న వరుస దాడులను గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.






