చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: మాజీ ఎమ్మెల్యే వర్మ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-17 15:15:46  IST  )

చంద్రబాబు ఆగమంటే ఆగుతానని.. దూకమంటే దూకుతానని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు...

చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: మాజీ ఎమ్మెల్యే వర్మ
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆగమంటే ఆగుతానని, దూకమంటే దూకుతానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ(Former Mla Varma) అన్నారు. అమరావతి(Amaravati)లో మంత్రి నారాయణను ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో ఆయనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో తాను పిల్లార్ లాంటివాడినని, అసత్యాలు పట్టించుకోనని వర్మ తెలిపారు.

మంత్రి నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తెలిపారు.

Next Story