మీరంతా ఏం చేస్తున్నారు: చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

పిఠాపురంలో టీడీపీ కౌన్సిలర్లపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు..

మీరంతా ఏం చేస్తున్నారు: చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం(Pithapuram)లో టీడీపీ(Tdp) కౌన్సిలర్లపై మాజీ ఎమ్మెల్యే వర్మ(Former Mla Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్(Swachhandra Corporation) ఆధ్వర్యంలో పిఠాపురంలో పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అయితే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో కనిపించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు. పార్టీలో ఇంత మంది కౌన్సిలర్లు ఉండి కూడా చంద్రబాబు ఫోటో ఉందో లేదో చూసుకోరా అంటూ మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు ఫోటో లేనప్పుడు తాను ఎందుకు కూర్చోవాలంటూ వెళ్లిపోయారు.

Next Story