వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది..

వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhanani Vamsi)కి మరో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు(Ap High Court) బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఏపీ ప్రభుత్వం(Ap Government) సవాల్ చేసింది. ఏసీబీ కేసు(Acb Case)లో పీటీ వారెంట్ జారీ అమలు చేస్తున్నారంటూ వల్లభనేని వంశీ హైకోర్టుకు వెళ్లారు. దీంతో వెకేషన్ కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వానికి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక అందజేశారు. ఈ మేరకు వల్లభనేని వంశీ బెయిల్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరంలో మట్టి తవ్వకాలకు సంబంధించి విజిలెన్స్ నివేదిక ప్రకారం కేసు నమోదు చేశారు. దీంతో ఏసీబీ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారని హైకోర్టుకు వెళ్లారు వల్లభనేని వంశీ.

Next Story