- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayush Hospital: వల్లభనేని వంశీ డిశ్చార్జి
విజయవాడ ఆయూష్ ఆస్పత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డిశ్చార్జి అయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఆయూష్ ఆస్పత్రి(Vijayawada Ayush Hospital) నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi) డిశ్చార్జి అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కోర్టు ఆదేశాలతో పోలీసులు మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ చేశారు. దీంతో శ్వాస సంబంధిత సమస్యకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొనడంతో వంశీని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ మేరకు ఆయనను మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 5న కోర్టుకు వైద్యులు పూర్తి రిపోర్టును అందించనునున్నారు. కాగా పలు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. కొన్ని కేసులో లోతు విచారణ కోసం వంశీని కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పూర్తి స్థాయి వైద్య పరీక్షల కోసం కోర్టు అనుమతితో వంశీకి చికిత్స చేయించారు.






