- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pithapuram: వర్మ తీవ్ర అసంతృప్తి
మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(Pithapuram TDP leader and former MLA SVSN Verma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLA Quota in MLC elections) సీటు దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) నిరాశ మిగిల్చారు. దీంతో వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును వర్మ త్యాగం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఆయనకు నిరాశ మిగిలింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానీ ఆయన పేరు లేదు. దీంతో వర్మ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాను సీటు త్యాగం చేసినా కూడా వేస్ట్ అని అనుచరుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి ఇప్పుడు నిరాశ మిగిల్చినా వర్మకు భవిష్యత్తులో కూటమి నాయకులు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.






