టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్: మాజీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-29 14:39:56  IST  )

కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు..

టీడీపీ మహానాడు అట్టర్ ప్లాప్: మాజీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కడప(Kadapa)లో నిర్వహించిన టీడీపీ మహానాడు(TDP Mahanadu) అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి(Former MLA Srikanth Reddy) అన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడులో జగన్‌ను టీడీపీ నేతలు విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను విమర్శించడానికి మహానాడు నిర్వహించారని ఆరోపించారు. రాయలసీమను చంద్రబాబు అన్ని విధాలుగా దగా చేశారని వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేసేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తీసుకొచ్చారని చెప్పారు. పులివెందుల మెడికల్ కాలేజీ వ్యహారంలో చంద్రబాబు మోకాలడ్డారని మండిపడ్డారు. పోలవరం నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కమీషన్ల కోసమే పోలవరాన్ని నిర్మిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ఏడాది పాలనలో రాజకీయ కక్షలను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకే జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

Next Story