త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తా: మాజీ ఎమ్మెల్యే రాపాక కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-10-13 11:14:43  IST  )

త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. ..

త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తా: మాజీ ఎమ్మెల్యే రాపాక కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో వైసీపీ(Ycp)కి రాజీనామా చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు(Former MLA Rapaka Varaprasada Rao) తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జరిగిన జనసేన సమావేశం(Janasena Meeting)లో ఆయన ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై రాపాక క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయబోతున్నాననే విషయాన్ని ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి చెప్పానని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి వైసీపీ అధిష్టానం చెప్పినట్లు చేశానని, కానీ తనను కాదని గొల్లపల్లి సూర్యారావు(Gollapally Surya Rao)కు టికెట్ కేటాయించారని వ్యాఖ్యానించారు. తనకు ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయమన్నారని తెలిపారు. అందుకే వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని స్పష్టం చేశారు. ఏ పార్టీ చేరతాననేది ఇప్పుడే చెప్పలేనని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు.

Next Story