పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం..పెళ్లిళ్లకు పోకూడదా అంటూ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-03 09:38:16  IST  )

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు..

పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం..పెళ్లిళ్లకు పోకూడదా అంటూ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy), మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Pedda Reddy) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడిపత్రి పుట్లూరు(Tadipatri Putlur) రహదారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఊరు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని, తిరిగి వెళ్లిపోవాలంటూ సూచించారు. తాను పెళ్లికి వెళ్లే విషయంపై ఎస్పీకి లేఖ రాశానని, తనను వెళ్లినివ్వాలని పోలీసులను కోరారు. కానీ ఒప్పుకోకపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు పోకూడదని తనకు ఎవరూ చెప్పలేదన్నారు.పెళ్లిళ్లకు పోకూడదని తనకు రాసివ్వాలని పోలీసులను నిలదీశారు. తానేమీ దోషిని కాదని, ఎక్కడ తిరగొద్దని చెప్పడం సరికాదని పెద్దారెడ్డి మండిపడ్డారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Next Story