Ap: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-19 11:18:30  IST  )

మంత్రి నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌కు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ మద్దతు తెలిపారు...

Ap: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)కు ఉప ముఖ్యమంత్రి(Deputy Cm) పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్న వేళ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ(Pithapuram Former Mla Nvss Varma) కూడా మద్దతు తెలిపారు. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి భవిష్యత్తు లేదన్న వాళ్లందరికీ ‘యువగళం’(Yuvagalam)తో లోకేశ్ సమాధానం చెప్పారని వర్మ గుర్తు చేశారు. జనసేన(Janasena) కార్యకర్తలు పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారని, టీడీపీని బలోపేతం చేసి, కార్యకర్తలకు మనోధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని నిలదీశారు. లోకేశ్ ఉప ముఖ్యమంత్రి కావాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ఇది తన ఒక్కడి మాట కాదని, టీడీపీ కార్యకర్తలందరిదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని వర్మ స్పష్టం చేశారు.

కాగా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలను జనసేన సీరియస్‌గా తీసుకుంది. తమ అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆ పదవిని లోకేశ్‌కు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కౌంటర్‌గా రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌కు కూడా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. జనసేన నేతల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story