ఎట్టకేలకు తాడిపత్రికి కేతిరెడ్డి.. దగ్గరుండి తీసుకెళ్లనున్న పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-17 12:11:29  IST  )

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టులో భారీ ఊరట లభించింది...

ఎట్టకేలకు తాడిపత్రికి కేతిరెడ్డి.. దగ్గరుండి తీసుకెళ్లనున్న పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Pedda Reddy) కోర్టులో భారీ ఊరట లభించింది. తన సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు ధర్మాసనం అనుమతించింది. అంతేకాదు పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలని సూచనలు చేసింది.

మరోవైపు తాడిపత్రి(Tadipatri)లో శివుడి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాన్నిటీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఏర్పాటు చేశారు. భారీగా కార్యకర్తలు తరలిరావాలని ఇప్పటికే ఆయన పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో చేసిన ఘటనల కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిపెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వలేదు. కోర్టు అనుమతితో కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారమే తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ టీడీపీ, వైసీపీ నేతలతో పాటు స్థానికుల్లోనూ నెలకొంది.

Next Story