తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Vemula.Srinu Prasad |

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది...

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: చాలా రోజులుగా తన సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Pedda Reddy)కి బిగ్ రిలీఫ్ లభించింది. తాడిపత్రి(Tadipatri)కి వెళ్లేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాటే శాసనంగా సాగింది. ప్రత్యర్థులపై దౌర్జన్యాలకు అంతూపొంతేలేదు. అప్పటి ప్రతిపక్షమైన స్థానిక టీడీపీ నేతల విషయంలో దురుసుగా వ్యవహరించారు. వైసీపీ తప్పులపై నోరెత్తినివ్వకుండా గొంతుమూసే ప్రయత్నం చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు వింటేనే పెద్దారెడ్డి రెచ్చిపోయారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. అయితే వైసీపీకి అధికారం పోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి టైమ్ కలిసొచ్చింది. దీంతో తనదైన స్టైల్లో ఆయన కూడా రంగంలోకి దిగారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వలేదు. స్థానిక, హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోయారు. పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో పోలీసులకు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయనను అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో పెద్దారెడ్డి అనుచరులు పండగ చేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story