- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమెప్పుడైనా అడిగామా..: చంద్రబాబు నివాసంపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకుంటున్న ఇంటిపై మాజీ మంత్రి పేర్ని నాని

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని ప్రాంతం వెలగపూడి(Velagapudi)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) 25 వేల చదరపు గజాల స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నివాసంపైనా మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జగన్ బెంగళూరులో ఉంటున్న విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ మావిగన్‌కు మద్దతుగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నివాసంపై ప్రస్తావించారు. జగన్ 4840 గజాల్లో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అయినప్పుడు.. మరి చంద్రబాబు నిర్మించుకుంటున్న ఇంటిని ఏమనాలని ప్రశ్నించారు. 25 వేల గజాల్లో చంద్రబాబు కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారని, మరి అంత స్థలం ఎందుకని తామెప్పుడైనా ప్రశ్నించామా అని నిలదీశారు. ఇల్లు కట్టుకునేందుకు సీఎం చంద్రబాబు ఎకరం భూమి కొనుగోలు చేశారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాము రాజధాని ప్రాంతంలో ఉంటుంటే తమ ఊళ్లలో ఏం కడుతున్నారన్నారు. ఇప్పటివరకూ తమ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఏది అని ప్రశ్నించారు. మావిగన్ ప్రాతిపాదనతోనే చాలా మార్పులు ప్రారంభమయ్యాయని పేర్ని నాని తెలిపారు.






