- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అరెస్టులు చేస్తే బెదిరిపోతామా?’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడి సంవత్సరం కావస్తున్న సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పై ప్రభుత్వానికి ధ్యాస లేదని అంబటి రాంబాబు విమర్శించారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP) హయాంలో సంక్షేమం, అభివృద్ధి, విశ్వసనీయత అన్ని బాగున్నాయి.
రాష్ట్రం అభివృద్ధి చెందింది. కూటమి ఏడాది పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం తిరోగమనం వైపు అడుగులు వేస్తోందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పులి మీద స్వారీ చేస్తున్నారు. స్వారీ ఆపగానే ఆ పులి ఇద్దరినీ మింగేస్తుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ధనుంజయ్, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్‌ల వెనుక.. రాజకీయ కుట్ర కోణం ఉంది. అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) తేల్చి చెప్పారు. తమను ఎంత వేధిస్తే అంత బలంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పుడో జరిగిన అంశాలపై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పోలీసులను ఉసిగొల్పి మా పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులను ఇలానే వేధిస్తే కూటమి ప్రభుత్వాన్ని(AP Government) కూకటి వేళ్లతో సహా పేకిలిస్తాం అని ఆయన హెచ్చరించారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.






