‘సీఎం చంద్రబాబును వెంటాడుతూనే ఉంటాం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘సీఎం చంద్రబాబును వెంటాడుతూనే ఉంటాం’.. మాజీ మంత్రి  సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసేంతవరకు చంద్రబాబును వైసీపీ వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేంతవరకు వైసీపీ పోరాడుతూనే ఉంటుందని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. రెండు సంవత్సరాలు ఎగనామం పెట్టిన ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ను సీఎం చంద్రబాబు నుంచి కక్కిస్తామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కాలు పెడితే అంతా సర్వనాశనం అవుతుందని, పంటలు కూడా పండవని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.

Next Story