ముగిసిన మాజీ మంత్రి కస్టడీ.. సెంట్రల్ జైలుకు తరలింపు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-08 14:15:46  IST  )

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసులు మూడో రోజు విచారించారు.

ముగిసిన మాజీ మంత్రి కస్టడీ.. సెంట్రల్ జైలుకు తరలింపు
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసులు మూడో రోజు విచారించారు. క్వార్జ్ట్ అక్రమంగా తవ్వకాలు జరిపిన కేసులో ఆయనను పోలీసులు శుక్రవారం నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న(శనివారం) మరింత లోతుగా విచారించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకాణిని మొత్తం 40 ప్రశ్నలు అడిగారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసినట్లు సమాచారం. ఈ తరుణంలో మైనింగ్ వ్యవహారంతో తన ప్రమేయం లేదని, తప్పుడు కేసు పెట్టారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టితో(ఆదివారం) వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. అక్రమ మైనింగ్ కేసులో మూడు రోజుల పాటు ఆయనను పోలీసులు విచారించారు. ఇక, గడువు ముగియడంతో ఇవాళ నెల్లూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. ఈ తరుణంలో తనపై కావాలనే అట్రాసిటీ కేసు, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేశారని కాకాణి కోర్టుకు వెళ్లే ముందు వ్యాఖ్యానించారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story