‘కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-19 12:09:50  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Former Minister Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు

‘కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Former Minister Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(సోమవారం) విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదని ఆయన విమర్శించారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు.. 20 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వాని(AP Government)కి ప్రజా సమస్యలు పట్టవని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం.. మోసం చేయడం సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అలవాటే అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ‘ఆడబిడ్డ నిధి పథకం’ పై కూటమి నేతలు స్పందించాలని ఆయన పేర్కొన్నారు.

Next Story