- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహానాడులో నందమూరి ఫ్యామిలీ లేదు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కడప జిల్లాలో మూడు రోజులు జరిగిన టీడీపీ మహానాడు పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

దిశ,వెబ్‌డెస్క్: కడప జిల్లాలో మూడు రోజులు జరిగిన టీడీపీ మహానాడు పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడపలో మహానాడు పెట్టడం వల్ల తమకు బలం ఉందని నిరూపించే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మూడు రోజుల మహానాడు కార్యక్రమంలో తాము అధికారంలోకి వచ్చి ఏం చేశారో మాత్రం చెప్పలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై మాట్లాడలేదు. ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాల్లో ఏది ఎప్పుడు అమలు చేస్తారో కూడా చెప్పలేకపోయారని మాజీ మంత్రి అంబటి దుయ్యబట్టారు.
అధికారంలో లేనప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్నారు. వారు ఎన్టీఆర్‌కు భారతరత్న పై ప్రతిపాదన చేయొచ్చు కదా అన్నారు. మహానాడు కార్యక్రమం అంతా ఓ డ్రామ. అందులో ఆర్టిస్టులను తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ మహానాడులో నందమూరి ఫ్యామిలీ లేదు అన్నారు. మహానాడు వేదిక పై నందమూరి వంశంలోని ఒక్కరు కూడా కనిపించలేదని పేర్కొన్నారు. దీంతో ఈ కార్యక్రమం కాస్త నారావారి మహానాడులా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అనుభవం లేకుండా నారా లోకేష్ మాట్లాడుతున్నారని చెప్పారు. అన్యాయంగా మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.






