- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఈనెల 30కు వాయిదా పడింది..

X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఈనెల 30కు వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో శుక్రవారం వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఆరుగురు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 30కు వాయిదా వేసింది. అనంతరం నిందితులను అధికారులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు.
Next Story






