గుండెకు స్టంట్ వేయించుకున్నా.. ఆందోళన వద్దు: మాజీ మంత్రి యనమల

by Vemula.Srinu Prasad |

తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు స్పందించారు. వైద్యుల సూచన మేరకు తాను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు...

గుండెకు స్టంట్ వేయించుకున్నా.. ఆందోళన వద్దు: మాజీ మంత్రి యనమల
X

దిశ, వెబ్ డెస్క్: తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) స్పందించారు. వైద్యుల సూచన మేరకు తాను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు తనకు స్టెంట్ వేసినట్లు యనమల స్వయంగా ప్రకటించారు.

ఆరోగ్యం నిలకడగా ఉంది

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యనమల స్పష్టం చేశారు. ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తాను విశ్రాంతి తీసుకుంటున్నానని, ప్రస్తుతం తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని యనమల కోరారు.

త్వరలో కలుస్తా..

త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య చికిత్స పూర్తయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి అందరినీ కలుస్తానని ఆయన తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

Next Story