బహిరంగ చర్చకు రా..: జగన్‌కు యనమల సవాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-15 10:31:16  IST  )

బహిరంగ చర్చకు రావాలని వైఎస్ జగన్ కు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు...

బహిరంగ చర్చకు రా..: జగన్‌కు యనమల సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తోందని వైసీపీ(Ycp) నేతల చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Former Minister Yanamala Ramakrishnudu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. చర్చకు వస్తే అన్ని విషయాలు వివరిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జగన్ ప్రభుత్వం చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని కూటమి ప్రభుత్వం భరిస్తోందని యనమల మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Former Minister Buggana Rajendranath) చేసిన విమర్శలు ఉత్తుత్తివేనని ఆయనకు కూడా తెలుసని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం జరగని పనులను కూడా తమ ప్రభుత్వం చేసి చూపిస్తోందని యనమల పేర్కొన్నారు.

Next Story