- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఖజానా అంతా ఖాళీ.. తేల్చేసిన మాజీ మంత్రి
ఏపీ ఖజానా అంతా ఖాళీ అయిందని దానికి తోడు విపరీతంగా అప్పులు కూడా ఉన్నాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఖజానా(AP Treasury) అంతా ఖాళీ అయిందని దానికి తోడు విపరీతంగా అప్పులు కూడా ఉన్నాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Former Minister Yanamala Ramakrishna) తెలిపారు. తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాలేదని ఆయన తెలిపారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల్లోకి నెట్టిందన్నారు. కేంద్రం ఆర్థిక సాయం చేయకపోతే తీవ్ర కష్టాలుంటాయని యనమల పేర్కొన్నారు.
కాగా విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా ఏపీకి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నప్పటికీ లోటు బడ్జెట్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2014 -19లో కొంత మేర పర్వాలేదనుకున్నా.. 2019-2024 కాలంలో ఏపీ అప్పులు భారీగా పెరిగాయి. సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక విధ్వంసం జరిగిందని అప్పట్లో నిపుణులు సైతం తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. కానీ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రకాల పనులకు టెండర్లు పిలిపించింది. మరికొన్ని టెండర్లకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.






