- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనర్హత పరిధిలోకి జగన్ కామెంట్స్.. వేటుపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు
జగన్ అనర్హత వేటుపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్ష హోదా(Opposition status) ఇవ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్(YSRCP chief YS Jagan), ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ(Assembly)ని బహిష్కరిస్తామని చేసిన వ్యాఖ్యలు అనర్హత వేటుకు గురి చేసేలా ఉన్నాయి. హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామని బహిరంగా చెప్పడం అనర్హత కిందకు వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అసలు అనర్హత వేటు నిబంధనలు ఏంటని అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Former Minister Yanamala Ramakrishnudu) స్పందించారు. అసలు అనర్హత వేటు నిబంధనలు ఏంటని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188,190(4) చదివితే అర్ధమవుతుందని, అప్పడు ఆ సందేహాలు రావని విమర్శించారు.అప్పటికి అర్ధం కాకపోతే న్యాయవాదులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. రెండు నెలల పాటు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయొచ్చని చెప్పారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే అంశం కూడా కోర్టు పరిధిలో ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీకి రాకుండా బహిష్కరిస్తామని చెప్పడం అనర్హత పరిధిలోకి వస్తుందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.






