- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి
అధికారంలోకి వస్తే రూ.100 ఉన్న పెట్రోలు రేట్లు తగ్గిస్తామని, ట్యాక్సులు తగ్గిస్తామని ఎన్నికల ముందు చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు రూ.113కి పెట్రోల్ అమ్ముతూ చేస్తున్నది బాదుడే బాదుడు కాదా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు...

దిశ, వెబ్ డెస్క్: అధికారంలోకి వస్తే రూ.100 ఉన్న పెట్రోలు రేట్లు తగ్గిస్తామని, ట్యాక్సులు తగ్గిస్తామని ఎన్నికల ముందు చెప్పిన నారా లోకేష్(Nara Lokesh) ఇప్పుడు రూ.113కి పెట్రోల్(Petrol) అమ్ముతూ చేస్తున్నది బాదుడే బాదుడు కాదా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు(Former Minister Vellampalli Srinivas) మండిపడ్డారు. తప్పుడు హామీలు ఇచ్చిన లోకేష్‌పై చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ను నిలదీయాలని వెల్లంపల్లి పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్(Diesel) ధరలు ఒక్క ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ప్రతి రోజు ప్రజలపై రూ. రూ. 10 కోట్లు భారం వేయడం దారుణమని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా కార్లు, బైకులపై ప్రయాణం చేయొద్దని చంద్రబాబు, పవన కల్యాణ్, లోకేష్ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.






