- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీని అగ్రస్థానంలో నిలిపింది జగనే: మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీని అగ్రస్థానంలో నిలిపింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డినేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)ని అగ్రస్థానంలో నిలిపింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)నేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Former Minsiter Chandrababu Mohan Reddy) సెటైర్లు వేశారు. పెట్రో ధరల(Petrol Price) పెంపుపై జగన్ మాటలు అర్థరహితమని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువని వైసీపీ(Ycp) నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2024 జూన్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగిపోయిన రోజుకు ఉన్న ధరలే ఈ రోజుకీ ఉన్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఆ ధరలో ఒక్క పైసా కూడా పెంచలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోలుపై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం ధరలు పెంచిందని తెలిపారు. ఆ మూడు శాతం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు భారం వేయలేదని, దేశంలోనే ఏపీలో ఎక్కువ ధర ఉండేందుకు కారణం జగన్మోహన్ రెడ్డినేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
తీవ్రంగా ఖండిస్తున్నా..
కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడాన్ని తీవ్రంగా తాను ఖండిస్తున్నానన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం నెలకొందని, ఒక్కో దేశం గరిష్టంగా పెట్రోలుపై 89.7 శాతం, డీజిల్ పై 112 శాతం వరకు ధరలు పెంచాయని చెప్పారు. మలేషియాలో పెట్రోలుపై 56.3 శాతం, డీజిల్‌పై 71.2 శాతం, యూఏఈలో 52.4 శాతం, 86.1 శాతం, అమెరికాలో 44.5 శాతం, 48.1 శాతం, న్యూజిలాండ్‌లో 30.7 శాతం, 88.6 శాతం ధరలు పెంచారని తెలిపారు. అన్ని దేశాలకంటే తక్కువగా భారత్‌లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలుపై కేవలం 3.2, డీజిల్‌పై 3.4 శాతం మాత్రమే ధరలు పెంచిందన్నారు. ఇలాంటి వాస్తవాలను కూడా ప్రతిపక్ష పార్టీలు గుర్తించలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.






