- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశీబుగ్గ పీఎస్‌లో మాజీ మంత్రి అప్పలరాజు... మూడు గంటలుగా విచారణ
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు విచారిస్తున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Former Minister Seediri Appalaju)ను కాశీబుగ్గ(Kashibugga) పోలీసులు విచారిస్తున్నారు. గత ఏడాది నమోదు అయిన కేసులో ఆయన్ను మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు విచారణకు రావాలని అప్పలరాజుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. దీంతో కాశీబుగ్గ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నారు. అప్పలరాజు విచారణ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. తమ నేతపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ నాయకుడిపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాటపై విమర్శలు చేసినందుకే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.






