అమరావతి అప్పుల ప్రాజెక్ట్: శైలజానాథ్

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చులపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ..

అమరావతి అప్పుల ప్రాజెక్ట్: శైలజానాథ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital) అమరావతి(Amaravati) నిర్మాణ ఖర్చులపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్(Former Minsiter Sake Sailajanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల(Iconic Buldings) అసలు వ్యయం ఎంతో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానిలో వరదలు(Floods) మాత్రమే కాకుండా, అవినీతి ప్రవాహం కూడా సాగుతోందని ఆయన ఆరోపించారు. అమరావతి అనేది భవిష్యత్తులో ప్రజలకు ఒక పెద్ద అప్పుల ప్రాజెక్టుగా మారబోతోందని శైలజానాథ్ హెచ్చరించారు. గతంలో పనులు వదిలేసిన పాత కంపెనీలకే మళ్లీ టెండర్లు కట్టబెట్టడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతున్నారని, అలా చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

రీ-టెండరింగ్ ప్రక్రియలో...

ఈ ప్రాజెక్టు రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. కొన్ని నిర్దిష్ట సంస్థలకే ప్రయోజనం చేకూర్చేలా వ్యవహారాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి ఖర్చుల వివరాలను పూర్తిగా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు.

Next Story