RK Roja:వైఎస్ షర్మిల పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

RK Roja:వైఎస్ షర్మిల పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయాలు చూస్తే.. ఒకరిపై అసూయ, ద్వేషంతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి? అని మాజీ మంత్రి రోజా(Former Minister) విమర్శించారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమకు తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు.

ఒకప్పుడు వేల రూపాయలు అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారనేది.. ప్రజలందరికీ తెలుస్తోందని రోజా పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమని.. విచారణను పక్క రాష్ట్రానికి మార్చమని చెప్పారని అన్నారు. ఇప్పుడు అధికారంలో టీడీపీనే ఉన్నా, ఏడుపు మాత్రం మా మీదే అని మాజీ మంత్రి రోజా వైఎస్ షర్మిల పై విరుచుకు పడ్డారు.

నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా? అని వైఎస్ షర్మిలను నిలదీశారు. ఇందులో భాగంగానే మీరు నిర్దోషులపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. చివరికి, మీ అన్న జగన్‌ను ఇబ్బంది పెట్టడమే మీ అసలు గమ్యం అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story