- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు పారిపోయారు.. చంద్రబాబు నగరి టూర్‌పై రోజా సెటైర్లు
సీఎం చంద్రబాబు నాయుడు నగరి టూర్‌పై మాజీ మంత్రి రోజా సెటైర్లు వేశారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) నగరి టూర్‌పై మాజీ మంత్రి రోజా(Former Minister Roja) సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చెబుతున్న అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. నగరిలో టీడీపీ(Tdp) ఎమ్మెల్యే చేసింది శూన్యమని విమర్శించారు. కల్యాణమండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామని చెప్పారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని తెలిపారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్‌టైల్ పార్క్ పెడతామంటారన్నారు. నగరి నియోజకవర్గానికి ఉపయోగపడేది ఒక్కటీ లేదదని రోజా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామిడి రైతులను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇప్పటివరకూ ఇవ్వలేదని, సూపర్ సిక్స్ ఎలా సక్సెస్ అయిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారని, ఈ స్కీమ్‌ను కూడా ఎగ్గొట్టారని విమర్శించారు. తల్లికి వందనం పేరుతో పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు.






