- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Womens Day: ‘జగనన్న మోసం’ అంటూ రోజా తడబాటు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి రోజా పొగడబోయి విమర్శించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former AP Chief Minister Jagan Mohan Reddy)ని మాజీ మంత్రి రోజా(Former Minister Roja) పొగడబోయి విమర్శించారు. మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu) మోసం చేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందో గుర్తు చేశారు. అయితే చంద్రబాబు పథకాలను విమర్శించబోయి జగన్‌పై విమర్శలు చేశారు. మహిళ అంటే చంద్రబాబుకు గౌరవం, అభిమానం లేదన్నారు. మహిళకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు, పవన్, అనితకు లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి గుర్తు రానన్ని పథకాలు మహిళలకు అమలు చేశామని చెప్పారు. చేయూత, అమ్మఒడి, ఆసరా, ఇళ్లు, రైతు భరోసా, సున్నా వడ్డీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు అమలు చేశామని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న పగ, చంద్రన్న దగా, చంద్రన్న నిత్యావసరాల ధరల భగభగ అంటూ అలాగే ‘జగన్న మోసం’ అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే సారీ అంటూ చంద్రన్న మోసం, చందన్న తల్లికి పంగనామం, చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు అంటూ విమర్శలు చేశారు.
అయితే రోజా చేసిన ‘జగనన్న మోసం’పై టీడీపీ(Tdp) నేతలు సెటైర్లు వేస్తున్నారు. జగన్ చేస్తున్న మోసాన్ని రోజా నోట ప్రజలందరూ విన్నారని కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎంత మోసం జరిగిందో ప్రజలకు తెలుసనని, అందుకే ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలో ఇచ్చారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎద్దేవా చేశారు.
Read Also..






