Rk Roja: తిరుమల అపవిత్రతపై నోరెత్తరే.. పవన్‌పై మరోసారి విమర్శలు

by Vemula.Srinu Prasad |

తిరుమల అపవిత్రతపై నోరెత్తరేంటని పవన్ కల్యాణ్‌‌పై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు...

Rk Roja: తిరుమల అపవిత్రతపై నోరెత్తరే.. పవన్‌పై మరోసారి విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల అపవిత్రతపై నోరెత్తరేంటని పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం(Tadepalli YCP Office)లో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పుకున్న డిప్యూటీ సీఎం తిరుమల(Tirumala)లో విచ్చలవిడిగా గంజాయి, మద్యం, బిర్యానీలు దొరకుంటే ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. ఇప్పుడెందుకు తిరుమల మెట్లు కడగడం లేదని నిలదీశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తానున్నానని చెప్పిన ఈ మనిషి రాజమహేంద్రవరంలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ప్రశ్నించేందుకు పవన్ కల్యాణ్ ఎందుకు ముందకు రావడం లేదన్నారు. అసెంబ్లీలో వెకిలి డ్రామాలకు పడిపడి నవ్వడానికి ఉన్న సమయం బాధితులకు న్యాయం చేయడానికి ఉండదా అని రోజా వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీకి భయపడే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వెళ్లలేదని విమర్శించారు.ఇలాంటి వ్యక్తి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడతారని ఎలా అనుకోవాలని మంత్రి రోజా ప్రశ్నించారు.

Next Story