- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని మోసగిస్తే...ఏమనాలి బాబు గారూ..!: మాజీ మంత్రి రోజా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు...

దిశ, వెబ్ డెస్క్: పేద విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. స్కూలుకు వెళ్తున్న ప్రతి విద్యార్థికి రూ. 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. శుక్రవారం ప్రారంభించిన ఈ పథకం డబ్బులు శనివారం కూడా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతున్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. స్కూలు వెళ్తున్న కొందరికి మాత్రమే ఈ పథకం డబ్బులు పడుతున్నాయని, మిగిలిన వాళ్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి రోజా(Former Minister Roja) సైతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme )పై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె విమర్శలు కురిపించారు. తల్లిని మోసగిస్తే ఏమనాలి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గారూ అంటూ ఆమె సెటైర్లు వేశారు. సూపర్‌సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఇటీవల అన్నారని రోజా గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. తల్లులకు మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి బాబు గారూ అంటూ ప్రశ్నించారు.
‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. అని రోజా ప్రశ్నించారు.






