చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు...

చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister Rk Roja) మండిపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీ(Tirumala laddu adulteration)పై కోర్టుకు సీబీఐ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల అవశేషాలు లేవని కోర్టుకు సీబీఐ నివేదిక ఇచ్చిందని, అయినా జగన్ పై దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. దేవుడిని అడ్డంపెట్టుకుని జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలను కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేషాలు మార్చుతున్నారని విమర్శించారు. కల్తీ వివాదం బయటకు వచ్చిన సమయంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏ దిక్ష చేస్తారని రోజా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కొవ్వు కలవకపోయినా భక్తుల మనోభావాలు దెబ్బతిశారని, ఇందుకుగాను ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

Next Story