సీనియర్ జర్నలిస్టు అరెస్ట్ పై మాజీ మంత్రి స్పందన

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-09 12:11:08  IST  )

రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

సీనియర్ జర్నలిస్టు అరెస్ట్ పై మాజీ మంత్రి స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్‌లో ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కృష్ణం రాజు, కొమ్మినేని శ్రీనివాస్‌రావు పై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

ఈ క్రమంలో ఇవాళ(సోమవారం) సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరబాద్‌లోని తన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టడానికి ఆయనను కట్టుదిట్టమైన భద్రతతో విజయవాడకు తరలిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘కొమ్మినేని కమ్మ కులస్తుడైనా తనను విమర్శిస్తున్నారని చంద్రబాబుకు కక్ష’’ అని ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను ట్యాగ్ చేశారు.

Next Story