- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంమంత్రి ఉన్నారో లేదో తెలియదు: మాజీ మంత్రి రజిని సెటైర్స్
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి విడుదల రజిని విమర్శలు కురిపించారు...

దిశ, వెబ్ డెస్క్: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Jammalamadugu Mla Adinarayana Reddy) కుమారుడు సుధీర్ రెడ్డి(Sudheer Reddy) డ్రగ్స్ కొనుగోలు చేస్తూ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ(Hyderabad Nanakramguda)లో ఈగల్ టీమ్(Eagle Team) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) విమర్శలు కురిపిస్తోంది. డ్రగ్స్, గంజాయికి మూల కారణం టీడీపీ(Tdp) వాళ్లేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ ను పెంచిపోషిస్తోంది కూటమి నాయకులేనని విమర్శిస్తున్నారు. గంజాయి లేకుండా చేస్తామని బీరాలు పలికి కూటమి వాళ్లే పట్టుబడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
కూటమి నాయకుల పిల్లలే..
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(AP Home Minister Vangalapudi Anitha)ను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి విడుదల రజిని(Former Minister Vidudala Rajini) విమర్శలు కురిపించారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారో లేదో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో డ్రగ్స్ నిరోధిస్తామని చెప్పారని, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దొరకడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు 251 శాతం పెరిగాయని, యువత జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. కూటమి నాయకుల పిల్లలే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతున్నారని విడుదల రజిని విమర్శించారు.






