- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోటి మంది బుద్ది చెప్పినా.. తప్పు చేస్తున్నారు: చంద్రబాబుపై పేర్నినాని ఫైర్
కోటి మంది బుద్ధి చెప్పినా సీఎం చంద్రబాబు తప్పు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు..

దిశ,వెబ్ డెస్క్: కోటి మంది బుద్ధి చెప్పినా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తప్పు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని(Former Minister Perni Nani) అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ(Government Medical Colleges Privatization)కు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పెట్టెలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను జగన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. 7 కాలేజీల నిర్మాణం పూర్తయ్యాయని చెపపారు. మరో పది నిర్మాణంలో ఉన్నాయన్నారు. పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుతున్నారని, . చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా.? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు మెడికల్ కాలేజీలను తన బ్రోకర్లకు అప్పనంగా కట్టబెట్టారని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.






