- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే మీ అంతు చూస్తా: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నీ నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నీ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు. “మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్రా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’’ అని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
ఇదిలా ఉంటే.. బందరు పోలీసుల పట్ల పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖను బెదిరిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా పేర్ని నాని, కిట్టు వ్యాఖ్యలతోపాటు చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు.






