- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ హౌసింగ్ శాఖపై పేర్ని నాని సంచలన ఆరోపణలు
రాష్ట్ర హౌసింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి, దోపిడీ, అక్రమాలపై త్వరలోనే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని హెచ్చరించారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హౌసింగ్ శాఖ(Housing Department)లో జరుగుతున్న దోపిడీ, అక్రమాలపై త్వరలోనే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని(Former minister and YSRCP leader Perni Nani) హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం(coalition government) హౌసింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవనీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. లబ్దిదారులను ప్రోత్సహించకుండా గృహ నిర్మాణాలను నీరుగార్చుతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల కోసం కొనుగోలు చేసిన స్టీల్‌ను సైతం అక్రమంగా తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమి నేతలకు అధికారులు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు మారుతాయని, ప్రజలు మారరని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న కాలనీల లబ్ధిదారుల అకౌంట్లను బ్లాక్ చేశారని మండిపడ్డారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం లేకుండా మోకాలు అడ్డుపెడ్డుతున్నారని ఆరోపించారు. మూడు సెంట్లు స్థలం ఇస్తామని ఓట్లు అడుకున్న కూటమి నేతలు జగన్ ఇచ్చిన సెంటు స్థలాన్ని కూడా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు తీసుకునేందుకు లబ్దిదారులు ఉత్సాహం లేదని సాకు చెప్పి ఆ స్థలాలను రద్దు చేసేందుకు మంత్రి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎవరి ఆస్తి ఎవరు రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు.






