- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య అయ్యాడు: పవన్ కల్యాణ్‌పై పేర్నినాని సెటైర్లు
ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య అయ్యాడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. ఎన్నికలయ్యాక చంద్రబాబుకు కాపులు అక్కర్లేకుండా పోయారని, ఎలక్షన్‌లో ఉపయోగించుకునేందుకు తురుపు ముక్క పవన్ కల్యాణ్ ఒక్కడున్నాడు చాలు అని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు...

దిశ, వెబ్ డెస్క్: ఓడ మల్లయ్య.. బోడి మల్లయ్య అయ్యాడని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు(Chandrababu)కు కాపులు అక్కర్లేకుండా పోయారని, ఎలక్షన్‌లో ఉపయోగించుకునేందుకు తురుపు ముక్క పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక్కడున్నాడు చాలు అని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోసపోయామని కాపులు ఇప్పుడు తెలుసుకున్నారని, కూటమి అంతు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. తిరుపతి(Tirupati) వెంకన్న ప్రసాదాన్ని అపవిత్రం చేసింది ఎవరు అని, వైష్ణవి డెయిరీతో వ్యాపారం చేసింది ఎవరు? అని పేర్ని నాని ప్రశ్నించారు. గేదెపాలు సేకరించి తిరుపతికి అవునెయ్యి సప్లై చేసే నైపుణ్యం సంగం డెయిరీకి ఉందని ఎద్దేవా చేశారు. రైతులు సహకార సంఘంగా ఏర్పాటయిన డెయిరీ ఇప్పుడు ఎవరి ఆస్తిగా మారిందని, దీనిపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారన్నారని విమర్శించారు. వైష్ణవి, సంగం డెయిరీలు కలిసి కల్తీనెయ్యిని తిరుపతి వెంకన్నకు సప్లై చేసిందని సీబీఐ నివేదికే చెప్పిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.






