- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చగొట్టారు.. అందుకే మాట్లాడా: దురుసు ప్రవర్తనపై పేర్ని నాని వివరణ
తనను రెచ్చగొట్టారని అందుకే అలా మాట్లాడానని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ..

దిశ, వెబ్ డెస్క్: తనను రెచ్చగొట్టారని అందుకే అలా మాట్లాడానని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) తెలిపారు. వైసీపీ నేత సుబ్బన్న(Ycp Leader Subbanna) అరెస్ట్‌పై ఆర్.పేట పోలీస్ స్టేషన్(R Peta Police station)లో చోటు చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. మెడికల్ కాలేజీల(Medical Colleges) ప్రైవేటీకరణపై నిరసన తెలిపిన సుబ్బన్నను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో రెండు, మూడు గంటలు పోలీస్ స్టేషన్ ఉంచారని చెప్పారు. అది అడగానికి వెళ్లిన తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సీఐతో వాగ్వాదం జరిగిందని, అందువల్లే గట్టిగా మాట్లాడానని పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.
‘‘మేయర్ భర్త నాగేశ్వరరావును తమాషాలు చేయొద్దని సీఐ మాట తూలారు. కాబట్టి మేము తిరగబడ్డాం. కుర్చీలో కూర్చొనే మాట్లాడా. హైపిచ్‌లో సీఐ మాట్లాడారు. నేను అలాగే మాట్లాడా. మమ్మల్ని ఉరి వేయలేవని సీఐ అన్నారు. సుబ్బన్నను ఉరివేస్తావా అని నేను ప్రశ్నించా. అంతే అక్కడి జరిగింది.’’ అని పేర్ని నాని తెలిపారు.






