- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ గ్రహించే అలా అన్నాడు: పేర్ని నాని సంచలన ఆరోపణలు
ఇక నుంచి జై అమరావతికాదని, జై ఆంధ్ర అనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు...

దిశ, వెడ్ డెస్క్: ఇక నుంచి జై అమరావతి(Amaravati) కాదని, జై ఆంధ్ర(Andhra) అనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) స్పందించారు. అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు(Cm Chandrabau) దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ గుర్తించారని, అందుకే జై అమరావతి కాదని, జై ఆంధ్ర అనమాన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కల్యాణ్ గ్రహించారని పేర్ని నాని జోస్యం చెప్పారు. అమరావతి పేరుతో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని, అయితే 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టారని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఇప్పటివరకూ ప్లాట్లు కేటాయించలేదని, ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సమాధానం చెప్పడంలేదని మండిపడ్డారు. అంతేకాకుండా తన ప్రశ్నలు అమరావతికి అవమానం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెమ్మసానిపైనా విమర్శలు
అటు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar)పైనా పేర్ని నాని విమర్శలు కురిపించారు. ఏ రోజైనా పెమ్మసాని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తల కష్టం పెమ్మసానికి ఏం తెలసని ఎద్దేవా చేశారు. అమరావతిలో మట్టిని దోచుకుంటున్నారని ఆరోపించారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు 700 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించారు. మట్టి దోచుకోవడం కోసమే భూములు సేకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజుకు వెయ్యి టిప్పర్ల మట్టి దోచుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు.






