రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్.. పేర్ని నాని హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-08 15:50:09  IST  )

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు..

MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) హాట్ కామెంట్స్ చేశారు. వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case) సాక్షులు వరుసగా మృతి చెందడపై మాజీ సీఎం జగన్‌(Former CM Jagan)పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసు సాక్షి రంగన్న మృతిని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, అశినాశ్ రెడ్డిపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యంగా పట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకానందారెడ్డి హత్యతో జగన్‌కు సంబంధంలేదన్నారు. వ్యవస్థలను ప్రభావిం చేసి వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు.

Read Also..

తాగిన మత్తులో కరెంట్‌ స్తంభాలను ఢీకొట్టిన డ్రైవర్.. చివరికి ఏమైందంటే?

Next Story