- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తండ్రిని నేనే చంపానా: మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్
తన తండ్రిని తాను చంపానా అని మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి తాను అన్నంపెట్టలేదని నిరాధారం లేని ఆరోపణలు చేశారని, మరి ఇంత దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు....

X
దిశ, వెబ్ డెస్క్: తన తండ్రిని తాను చంపానా అని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra)పై మాజీ మంత్రి పేర్ని నాని(Minsiter Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి తాను అన్నంపెట్టలేదని నిరాధారం లేని ఆరోపణలు చేశారని, మరి ఇంత దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర సంస్కారం మరిచి విషపూరితమైన నిందల్ని తనపై వేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి వేరే ఇంట్లో ఉంటున్నారని, ఆయనకు వ్యతిరేకంగా తాను నామినేషన్ వేశానని కొల్లు రవీంద్ర దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తన తండ్రి రాజకీయ జీవితం తెరిచిన పుస్తకంలాంటిదన్నారు. కొత్తగా కొల్లు రవీంద్ర అసత్యాలపై కొత్తతరం యువకులు తెలుసుకోవాల్సిన అవసరం లేదని పేర్ని నాని తెలిపారు.
Next Story






