సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజే మోసుకెళ్లాడా?: పేర్ని నాని

by Vemula.Srinu Prasad |

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఈ కేసు విచారణపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు.

సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజే మోసుకెళ్లాడా?: పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ(Gade Saikrishna) లాకప్ డెత్ కేసు(Custodial death case)లో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు(Former Krishnalanka CI Nagaraju)కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఈ కేసు విచారణపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Former YCP Minister Perni Nani) అనుమానం వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో బుధవారం జరిగిందంతా డొల్ల విచారణేనని ఆయన ఆరోపించారు. సాయికృష్ణ ఉదంతంపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రభుత్వం సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్‌లో మనిషిని చంపితే ఒక్క అధికారి కానీ, మంత్రి కానీ అడగలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని పేర్ని నాని విమర్శించారు.

జగన్ వెళ్లేదాకా FIR కట్టలేదు

సాయికృష్ణ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించే వరకూ FIR కట్టలేదని తెలిపారు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో అధికారులు ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. సాయికృష్ణ రౌడీషీటర్ అయితే చంపేస్తారా? అని ప్రశ్నించారు. సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా అని నిలదీశారు. మిగిలిన వారు లేరా? అని వ్యాఖ్యానించారు. ‘‘సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేయలేదా..?, మృతదేహం ఎలా మాయమైంది. సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలు పరిశీలించలేదు.’’ అని పేర్ని నాని నిలదీశారు.

Next Story