రాష్ట్రంలో మంచి నీళ్లలా మద్యం.. చంద్రబాబు, పవన్‌పై పేర్ని నాని ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-07 09:25:14  IST  )

రాష్ట్రంలో మంచి నీళ్లకు దిక్కులేదని, ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు

రాష్ట్రంలో మంచి నీళ్లలా మద్యం.. చంద్రబాబు, పవన్‌పై పేర్ని నాని ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మంచి నీళ్లకు దిక్కులేదని, ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం(Tadepalli YCP office)లో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు(Super Six Schemes) అమలు కావడంలేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ‘ఎమ్మెల్యేలకు డబ్బులివ్వండి.. బెల్ట్ షాపులు తీసుకోండి’ అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) హైదరాబాద్ వెళ్లిపోతున్నారని విమర్శించారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండని పిలుపునిచ్చిన ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఇస్తే ముగ్గురు అసలు రాష్ట్రంలో కనిపించడంలేదన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదని, బెంగళూరు వెళ్తున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హైదరాబాద్ వెళ్లిపోతుంటే ఎందుకు ప్రశ్నించరని పేర్ని నాని ప్రశ్నించారు.

Next Story