- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్
మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు...

దిశ, వెబ్ డెస్క్: 2024 సార్వత్రిక ఎన్నికల్లో(2024 General Election)లకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని(Perni Nani), ఆయన తనుయుడు కిట్టు(Kittu) 10 వేల పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీవంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేకు వాళ్లిదరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో వాళ్లిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు దాఖలు చేశారు. అధికారులకు వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాదు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ మచిలీపట్నం ఆర్డీవో, తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణకు రానుంది. దీంతో పేర్ని నాని ఫ్యామిలీలో ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయని లీగల్ టీమ్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?.






