Ap: మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుకు భారీ ఊరట

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టుకు భారీ ఊరట లభించింది...

Ap: మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుకు భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani), ఆయన తనయుడు కిట్టు(Kittu)కు భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం(Fake House Title Deeds Case)లో వాళ్లపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో వాళ్లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పేర్ని నాని, కిట్టు హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో తమకు అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పేర్ని నాని, కిట్టును నోటీసులు ఇచ్చి విచారించాలని సూచించింది. క్రిమినల్ కేసులు నమోదు చేసే ముందు వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించింది.

Next Story